తారాగణం: సుమన్, ముచ్చెర్ల అరుణ
గాత్రం: జేసుదాసు
సంగీతం: సత్యం
సాహిత్యం: మల్లెమాల
దర్శకత్వం: గిరిధర్
నిర్మాత: ఎం.ఎస్.రెడ్డి
విడుదల: 1983
పల్లవి:
వేగుచుక్క మొలిచింది
వేకువ పొడసూపింది
వేగుచుక్క మొలిచింది
వేకువ పొడసూపింది
తూరుపు తెలతెలవారకముందే
కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది
కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది
వేగుచుక్క మొలిచింది
వేకువ పొడసూపింది
తూరుపు తెలతెలవారకముందే
కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది
కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది
చరణం1:
జీవితమంటే కల కాదు
అది కవులు రచించే కథ కాదు
జీవితమంటే కల కాదు
అది కవులు రచించే కథ కాదు
కనుమరుగయినది సిరి కాదు
అది మనదని తలుచుట సరికాదు
కుడి ఎడమయితే పొరపాటులేదను
నానుడి సత్యం కాదు
ఇది అందరికర్ధం కాదు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
వేగుచుక్క మొలిచింది
వేకువ పొడసూపింది
తూరుపు తెలతెలవారకముందే
కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది
కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది
చరణం2:
ఎండిన మల్లెకు వెల లేదు
మండే గుండెకు చలి లేదు
ఎండిన మల్లెకు వెల లేదు
మండే గుండెకు చలి లేదు
మంచిని మించిన జత లేదు
విధి వంచన కన్నా వ్యధ లేదు
మనసే మనిషికి చిరుచేదైతే
మనుగడకర్ధం లేదు
ఇది అందరికర్ధం కాదు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
వేగుచుక్క మొలిచింది
వేకువ పొడసూపింది
తూరుపు తెలతెలవారకముందే
కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది
కాలం మాటేసింది, నా కళ్ళను కాటేసింది
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment