తారాగణం: చలం, జయంతి, భారతి
గాత్రం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కె.వి.మహదేవన్
నిర్మాత: జి.వి.యస్.రాజు
దర్శకత్వం: కె.విశ్వనాథ్
సంస్థ: విజయలక్ష్మి మూవీస్
విడుదల: 1974
మాతృదినోత్సవ సందర్భంగా అమ్మలందరికి మాతృదినోత్సవ శుభాకంక్షలు
పల్లవి:
పశువైనా పక్షైనా
మనిషైనా మాకైనా
అమ్మ మనసు ఒకటే
అమ్మ, దైవం ఒకటే
చరణం1:
తన తనువెల్లా కరగించి
తన బిడ్డలకా వెలుగులు పంచి
చీకటిగా తన జీవితమంతా
చిరిగిపోయినా చితికిపోయినా
చితిమంటల చిటపటలో కూడా
చిరంజీవ అని దీవించేది
అమ్మ మనసు ఒకటే
అందుకే దైవం అమ్మంటే
పశువైనా పక్షైనా
మనిషైనా మాకైనా
అమ్మ మనసు ఒకటే
అమ్మ, దైవం ఒకటే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహా
~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment