గాత్రం: ఎస్.పీ.చరణ్,సునీత
సాహిత్యం: చంద్రబోస్
పల్లవి:
ససలు గగలు గగలు నినిలు
ససలునినిలుగగలునినిలు
గమదనిసగసగసగమగసనిదనిదనిసగగమగమలు
చాలు చాలు చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
ముద్దుగముద్దుగ వినవలెరా నా ముద్దు విన్నపాలు పాలు
వన్నెపూలను విన్నపాలను ఆరగిస్తె మేలు
చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
చరణం1:
నీ కరములు నా మేనికి వశీకరములు
నీ స్వరములు ఈ రేయికి అవసరములు
నీ కరములు నా మేనికి వశీకరములు
నీ స్వరములు ఈ రేయికి అవసరములు
ఈ క్షణములు మన జంటకే విలక్షణములు
ఈ సుఖములు మునుపెరుగని బహుముఖములు
రా మాయింటికి మన్మధుడా అను పిలుపులు
ఆ లీలలు అవలీలలు
చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
చరణం2:
ఈ చిలకలు సరసానికి మధురగుళికలు
ఈ పడకలు మోక్షానికి ముందు నడకలు
ఈ చిలకలు సరసానికి మధురగుళికలు
ఈ పడకలు మోక్షానికి ముందు నడకలు
ఈ తనువులు సమరానికి ప్రాణధనువులు
ఈ రణములు రససిద్ధికి కారణములు
విరామాలెన్నడు ఎరుగనివి చలి ఈడులు తొలిదాడులు ఛీపాడులు
చాలు...ఛీ చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~
1 comment:
Thank you very much.. I like very much in this song.
Post a Comment