Sep 12, 2011

బంగారు తిమ్మరాజు

గాత్రం: జమునారాణి
సాహిత్యం: వీటూరి



పల్లవి:

నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన
నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన
ఎరవేసి హ గురిచూసి హ పట్టాలి మావా
ఎరవేసి గురిచూసి పట్టాలి మావా పట్టాలి మావా

చరణం1:

చూపుల్లో కైపుంది మావా సొగసైన రూపుంది మావా
చూపుల్లో కైపుంది సొగసైన రూపుంది
వయ్యారం ఒలికిస్తుంది వన్నెలు చిన్నెలు నేర్చింది
ఓ ఉడుకుమీద ఉరికావంటే జడుసుకుంటది
దాన్ని ఒడుపుచూసి మచ్చిక చేస్తే వదలనంటది మావోయ్

నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన
ఎరవేసి హ గురిచూసి హ పట్టాలి మావా పట్టాలి మావా

చరణం2:

నడకల్లో హొయలుంది మావా నాట్యంలో నేర్పుంది మావా
నడకల్లో హొయలుంది నాట్యంలో నేర్పుంది
మలిసందె చీకట్లోన నీటికి ఏటికి వస్తుంది
ఓ జాడ చూసి కాసావంటే దారికొస్తది
దాని జాలి చూపు నమ్మావంటే దగా చేస్తది మావోయ్

నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన
ఎరవేసి హ గురిచూసి హ పట్టాలి మావా
ఎరవేసి గురిచూసి పట్టాలి మావా పట్టాలి మావా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: