May 28, 2012

ఒకనాటి రాత్రి

గాత్రం: భానుమతి



పల్లవి:

చిట్టి చిట్టి చేతులతో పాప బంతులాడాలీ
దొరకని దొంగలకు గుణపాఠం నేర్పాలి

చరణం1:

గురిచూడనీ ఎరవేయని పగవారని తెలిసేదాక
గురిచూడనీ ఎరవేయని పగవారని తెలిసేదాక
ఎవరేమిటో ఎపుడేమిటో ఈ ఆట ముగిసేదాకా
బ్రతుకే బంతాట
ఇది ఒక వింతాట

చిట్టి చిట్టి చేతులతో పాప బంతులాడాలీ
దొరకని దొంగలకు గుణపాఠం నేర్పాలి

చరణం2:

పెద్దపులినైనాగాని మాటువేసి పడితే నీ ముందు పిల్లి కాదా
పెద్దపులినైనాగాని మాటువేసి పడితే నీ ముందు పిల్లి కాదా
పిల్లి పిల్లనైనాగాని కట్టి వేసి కొడితే పెద్దపులిగా మారిపోదా
తెలివిగ మెలగాలి మనిషిగ నిలవాలి

చిట్టి చిట్టి చేతులతో పాప బంతులాడాలీ
దొరకని దొంగలకు పాఠం నేర్పాలి
గుణపాఠం నేర్పాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: