తారాగణం: రాజశేఖర్, సాక్షిశివానంద్
గాత్రం: హరిహరన్, చిత్ర
సాహిత్యం: వెనిగళ్ళ రాంబాబు
సంగీతం: ఎస్.ఎ.రాజ్‌కుమార్
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: ఆర్.బి.చౌదరి
సంస్థ: సూపర్‌గుడ్ ఫిలింస్
విడుదల: 2001
పల్లవి:
తెలుసా నేస్తమా నేస్తమా పూజించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ
మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా
తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ
మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా
చరణం1:
మౌనమే కరగాలి మంత్రమై మ్రోగాలి
మదిలో నీ ప్రేమ మందిరమవ్వాలి
మమతలే పండాలి మనసులే నిండాలి
దైవం పలకాలి దీవెనలివ్వాలి
ప్రేమపైన నమ్మకాన్ని పెంచుకున్న చిన్నదాన్ని
ప్రేమతోనే జీవితాన్ని పంచుకుంటూ ఉన్నవాణ్ని
చెప్పలేని ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన
తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ
చరణం2:
ఎదురుగా రారాజు కదలగా ఈరోజు
పరువం పులకించి పరుగులు తీసింది
ప్రేమలో మమకారం ఏమిటో తెలిసింది
పున్నమిలా ఎదలో వెన్నెల కురిసింది
నింగి విడిచి గంగలాగ నిన్ను చేరుకున్నదాన్ని
కొంగులోనే దాచుకోవే పొంగుతున్న సాగరాన్ని
ఆడపిల్ల మనసు తెలిసిన తోడు నీడ నీవే
తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ
మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment