Jun 11, 2012

భార్యాభర్తలు

గాత్రం: ఘంటసాల
సాహిత్యం: శ్రీశ్రీ



పల్లవి:

జోరుగా హుషారుగా షికారు పోదమా
హాయి హాయిగా తీయతీయగా
జోరుగా హుషారుగా షికారు పోదమా
హాయి హాయిగా తీయతీయగా

చరణం1:

ఓ ఓ ఓ ఓ
బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే
చాల ప్రేమ పాఠములను చదువుకుంటినే ఓ ఓ ఓ ఓ
బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే
చాల ప్రేమ పాఠములను చదువుకుంటినే
మరువనంటినే మరువనంటినే
ఓ ఓ ఓ ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా...జోరుగా

చరణం2:

నీ వన్నెచిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే ఓ ఓ ఓ ఓ
వన్నెచిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలసిరాగదే కలసిరాగదే
ఓ ఓ ఓ ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా...జోరుగా

చరణం3:

నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే
కనులు తెరిచి ఎదుట నిన్నె కాంచినాడనే ఓ ఓ ఓ ఓ
కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే
కనులు తెరిచి ఎదుట నిన్నె కాంచినాడనే
వరించినాడనే వరించనాడనే

ఓ ఓ ఓ ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా
హాయి హాయిగా తీయతీయగా
జోరుగా జోరుగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: