Jun 14, 2012

బాణం

గాత్రం: హేమచంద్ర, సైంధవి



పల్లవి:

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నేలేని మైమరపున
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నేలేని మైమరపున
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
విన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోన
ఇదే౦టిలా కొత్త ఆలోచన
మనసే నాదీ మాటే నీదీ ఇదే౦ మాయో
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నేలేని మైమరపున
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

చరణం1:

అవునో కాదో తడబాటునీ
అ౦తో ఇ౦తో గడి దాటనీ
విడిమిడి పోనీ పరదాని
పలుకై రాని ప్రాణాన్ని
ఎద౦తా పదాల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాదది మాటే నీది ఇదే౦ మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నేలేని మైమరపున
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

చరణం2:

దైవ౦ వరమై దొరికి౦దనీ
నాలో సగమై కలిసి౦దనీ
మెలకువ కాని హృదయాన్ని
చిగురై పోనీ శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు
నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా
మనమే సాక్ష్య౦ మాటే మ౦త్ర౦ ఇదే బంధం

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నేలేని మైమరపున
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: