Jul 16, 2012

భార్యాభర్తలు

తారాగణం: నాగేశ్వరరావు,కృష్ణకుమారి
గాత్రం: ఘంటసాల, సుశీల
సాహిత్యం: శ్రీశ్రీ
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
సంస్థ: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల: 1961



పల్లవి:

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం
చల్లని పున్నమి వెన్నెలలో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఎన్నడు వీడని కౌగిలిలో ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ
చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో
కన్నుల వలపు కాంతుల మెరయగ
మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

చరణం1:

కరగిపోయె పెనుచీకటి పొరలు
కరగిపోయె పెనుచీకటి పొరలు
తొలగిపోయె అనుమానపు తెరలు
తొలగిపోయె అనుమానపు తెరలు
పరిమళించె అనురాగపు విరులు
పరిమళించె అనురాగపు విరులు
అలరెనే మనసు నందనవనముగ

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

చరణం2:

సఫలమాయె మన తీయని కలలు
సఫలమాయె మన తీయని కలలు
జగము నిండె నవజీవన కళలు
జగము నిండె నవజీవన కళలు
పొంగిపొరలె మన కోర్కెల అలలు
పొంగిపొరలె మన కోర్కెల అలలు
భావియే వెలిగె పూవుల బాటగా

మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: