Jul 19, 2012

బాణం

తారాగణం: నారా రోహిత్,వేదిక
గాత్రం: శ్రేయాఘోషల్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
సంగీతం: మణిశర్మ
నిర్మాత: శేషు ప్రియాంక చలసాని
దర్శకత్వం: చైతన్య దంతులూరి
సంస్థ: 3 ఏంజల్స్ స్టూడియో
విడుదల: 2009



పల్లవి :

మోగింది జేగంట మంచే జరిగేనంటా
మనసంటోంది ఈ మాట
కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా
నను పిలిచినది పూబాట
తనతో పాటే వెళ్లిపోతా
ఆకాశం నీడంతా నాదేనంటోంది
అలలు ఎగసే ఆశ
ఏ చింతా కాసింత లేనే లేదంది
కలత మరిచే శ్వాస
మోగింది జేగంట మంచే జరిగేనంటా
మనసంటోంది ఈ మాట

చరణం1:

పదపదమని నది నడకనీ ఇటు నడిపినదెవరైనా
తన పరుగులో తెలి నురగలో నను నేనే చూస్తున్నా
ప్రతి పిలుపునీ కథ మలుపనీ మలి అడుగులు వేస్తున్నా
అలుపెరుగనీ పసి మనసునై సమయంతో వెళుతున్నా
నలుసంత కూడా నలుపేది లేని
వెలుగుంది నేడు నా చూపున
ఏ దూరమో ఏ తీరమో ప్రశ్నించనీ పయనంలోన
ఈ దారితో సహవాసమై కొనసాగనా ఏదేమైనా ఆ
మోగింది జేగంట మంచే జరిగేనంటా
మనసంటోంది ఈ మాట
మనసంటోంది ఈ మాట

చరణం2:

ఒక చలువగా ఒక విలువగా జత కలిసినదో సాయం
మనసెరిగిన మధుమాసమై నను చేర్చిందే గమ్యం
కల నిలవని కనుపాపలో కళలొలికినదో ఉదయం
అది మొదలున నను ముసిరిన ఏకాంతం మటుమాయం
నా చుట్టూ అందంగా మారింది లోకం
ఊహల్లోనైనా లేదీ నిజం
చిరునవ్వుతో ఈ పరిచయం వరమయ్యిలా నను చేరేనా
బదులడగని ఈ పరిమళం నా జన్మనే మురిపించేనా
మోగింది జేగంట మంచే జరిగేనంటా
మనసంటోంది ఈ మాట
ఓ మనసంటోంది ఈ మాట

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: