తారాగణం: భానుమతి, చక్రపాణి, మధుబాబు, రాజీ, ప్రీతా
గాత్రం: భానుమతి
సంగీతం & దర్శకత్వం: భానుమతి
సంస్థ: శ్రీ మీనాక్షి ఫిలింస్
విడుదల: 1980
పల్లవి:
నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను
నిదుర నీకంటి పాప
నీవు మా కంటి పాప
జోలాలి లాలి లాలి
నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను
నిదుర నీకంటి పాప
నీవు మా కంటి పాప
జోలాలి లాలి లాలి
నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను
చరణం1:
కలలే పసివారి లోకం
నవ్వులే వారి నేస్తం
వయసు ఎంతైనా రాని
పాప మనసుండిపోనీ
జోలాలి లాలి లాలి
నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను
చరణ2:
నీవు నడిచేది బాటై
నలుగురూ నడిచిరానీ
కన్న నీవారి పేరు
గొప్పగా చెప్పుకోని
జోలాలి లాలి లాలి
నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను
నిదుర నీకంటి పాపై
నీవు మా కంటి పాపై
జోలాలి లాలి లాలి
నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment