Jan 22, 2014

ప్రేమాభిషేకం

గాత్రం: బాలు
సాహిత్యం: దాసరి నారాయణరావు



నాగేశ్వరరావుకి అశ్రునివాళి

పల్లవి:

వందనం అభివందనం నీ అందమే ఒక నందనం
వందనం అభివందనం నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలిచిన సుందరి పాదాభివందనం పాదాభివందనం
పాదాభివందనం పాదాభివందనం
వందనం అభివందనం నీ అందమే ఒక నందనం

చరణం1:

కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో
తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో
వస్తానని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని
తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి
తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి
ఎదురు చూసిన సారికా అభిసారికా సారీ
వందనం అభివందనం నీ అందమే ఒక నందనం

చరణం2:

జీవితమన్నది మూడు నాళ్ళని యవ్వనమన్నది తిరిగి రానిదని
ప్రేమన్నది ఒక నటనమని నీకంటు ఎవరున్నారని
వున్నారని ఎవరున్నారని వున్నానని నేను ఉన్నానని
ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గ పురానికి దారిచ్చి
ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గ పురానికి దారిచ్చి
సుఖము పోసిన మేనకా అభినయ మేనకా సారీ

వందనం అభివందనం నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలిచిన సుందరి పాదాభివందనం పాదాభివందనం
పాదాభివందనం పాదాభివందనం
వందనం అభివందనం నీ అందమే ఒక నందనం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: