Jan 24, 2014

ప్రేమాభిషేకం

గాత్రం: బాలు
సాహిత్యం: దాసరి నారాయణరావు




నాగేశ్వరరావుకి అశ్రునివాళి

పల్లవి:

తారలు దిగివచ్చిన వేళ,మల్లెలు నడిచొచ్చిన వేళ
చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి
చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి
తారలు దిగివచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ
తారలు దిగివచ్చిన వేళ

చరణం1:

ఊరంతా ఆకాశాన గోరంత దివ్వెగా
పిడికెడంత గుండెలోన కొండంత వెలుగుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
నిలిచిపొమ్మనీ మబ్బుగా కురిసిపొమ్మనీ వానగా
విరిసిపొమ్మనీ వెన్నెలగా మిగిలిపొమ్మనీ నా

గుండెగా
మిగిలిపొమ్మనీ నా గుండెగా

చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి
చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి
తారలు దిగివచ్చిన వేళ,మల్లెలు నడిచొచ్చిన వేళ
తారలు దిగివచ్చిన వేళ

చరణం2:

నీలిరంగు చీకటిలో నీలాల తారగా
చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
చెప్పిపొమ్మనీ మాటగా చేసిపొమ్మనీ బాసగా
చూపిపొమ్మనీ బాటగా ఇచ్చిపొమ్మనీ ముద్దుగా
ఇచ్చిపొమ్మనీ ముద్దుగా

చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి
చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి
తారలు దిగివచ్చిన వేళ,మల్లెలు నడిచొచ్చిన వేళ
తారలు దిగివచ్చిన వేళ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: