Jan 26, 2014

ప్రేమాభిషేకం

గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: దాసరి నారాయణరావు



నాగేశ్వరరావుకి అశ్రునివాళి

పల్లవి:

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరు బైట ఎండలో సరుగు తోట నీడలో
కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే
నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరు బైట ఎండలో సరుగు తోట నీడలో
బుచ్చిబాబు కనిపిస్తే నాకోసం పడిచస్తే
నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా

చరణం1:

హలో హలో హలో హలో
హలో హలో ఉం హలో ఉం
హలో హలో అనమంటుంది కుర్ర వయసు
చలో చలో పొమ్మంటుంది బుల్లి మనసు
పొమ్మని పైపైకి అంటుంది రమ్మని లోలోన ఉంటుంది
పొమ్మని పైపైకి అంటుంది రమ్మని లోలోన ఉంటుంది
పొమ్మని రమ్మంటే అది స్వర్గం
రమ్మని పొమ్మంటే అది నరకం
ఆ స్వర్గంలోనే తేలిపోవాలి
ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి
అవునంటే నువ్వు ఊ అంటే అహ అవునంటే నువ్వు ఊ అంటే
నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
అహ కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా

చరణం2:

గొంతు గొంతు కలిపి పాడితే యుగళగీతం
పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం
కళ్ళు కలుసుకుంటే ప్రేమ పాఠము
కళ్ళు కుట్టుకుంటే గుణపాఠము
కళ్ళు కళ్ళు కలిపి చూడు ఒక్కసారి
ఒళ్ళు ఝల్లుమంటుంది తొలిసారి
ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి
ఆ తడి కౌగిలిలో అలిసిపోవాలి
అవునంటే నువ్వు ఊ అంటే ఆ అవునంటే నువ్వు ఊ అంటే

నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరు బైట ఎండలో సరుగు తోట నీడలో
కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే
నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఎహేహే కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: