Jan 30, 2014

ప్రేమాభిషేకం

గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: దాసరి నారాయణరావు
నాగేశ్వరరావుకి అశ్రునివాళి

పల్లవి:

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని

చరణం1:

నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమని
ఊరూవాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళని
నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమని
ఊరూవాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళని
ప్రేమకే పెళ్ళని ఈ పెళ్ళే ప్రేమని
ప్రమా పెళ్ళని జంటని నూరేళ్ళ పంటని
నూరేళ్ళ పంటని

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని

చరణం2:

గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని
పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని
గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని
పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని
తోడంటే నేనని చెలిమంటే నువ్వని
నువ్వూ నేను జంటని నూరేళ్ళ పంటని
నూరేళ్ళ పంటని

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: