పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహా ఆ ఆ ఆ ఆ అ ఆ
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా హ ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా హ ఎటులైనా ఇచటనే ఆగిపోనా
చరణం1:
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా హ ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హ ఎటులైనా ఇచటనే ఆగిపోనా
చరణం2:
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదులెక్కి చలదొంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలి వెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా హ ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హ ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా హ ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
|
2 comments:
మీ పాటలు మా ఇంటిల్లిపాది పాడుకుంటాము
chala chala thanks andi.
Post a Comment