Nov 19, 2007

అమెరికా అమ్మాయి

గాత్రం:ఆనంద్






పల్లవి:

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

చరణం1:

సిరివెన్నెల తెలబోయెను జెవరాలి చూపులో
సిరివెన్నెల తెలబోయెను జెవరాలి చూపులో
నవమల్లిక చినబోయెను నవమల్లిక చినబోయెను చిరు నవ్వు సొగసులో
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

చరణం2:

వన రాణియె అలివేణికి సిగపూలు తురిమెను
వన రాణియె అలివేణికి సిగపూలు తురిమెను
రేరాణియె నారాణికి, రేరాణియె నారాణికి పారాణి పూసెను
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

చరణం3:

ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారక
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారక
నా గుండెలో వెలిగించెను నా గుండెలో వెలిగించెను సింగార దీపిక

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక




||

1 comment:

Anonymous said...

vihaari gaaru seetharatnam gaari abbaiyi lo

"పసివాడొ ఏమిటో ఆ పైవాడు, తను చేసే బొమ్మలతో....."

ఈ పాట మీకు అందుబాటులో ఉంటే బ్లాగులో వ్రాయగలరు