తారాగణం:చిరంజీవి, సుమలత
గాత్రం: బాలు, సుశీల
సంగీతం: మహదేవన్
సాహిత్యం: వేటూరి
నిర్మాతలు:వి వి.శాస్త్రి,అల్లు అరవింద్
దర్శకత్వం:కె.విశ్వనాథ్
విడుదల: 1982
సంస్థ:గీతా ఆర్ట్స్,ప్రశాంతి క్రియేషన్స్
పల్లవి:
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా
నా ఉద్యోగం పోయిందండి
తెలుసు అందుకే
రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా
రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా
ఎందుకమ్మా
చరణం1:
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగతీగ పలికించే వీణలమ్మకి
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగతీగ పలికించే వీణలమ్మకి
బహుశా అది తెలుసో ఏమో ఉహు ఉహు ఉహు ఉహు ఉహు
బహుశా అది తెలుసో ఏమొ జాణకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ అందుకేనా అందుకేనా
చరణం2:
గుండెలో బాధలే గోంతులో పాటలై పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
గుండెలో బాధలే గోంతులో పాటలై పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
బహుశ తను ఎందుకనేమో లలాలలాలలాల
బహుశ తను ఎందుకనేమో గడుసుకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేనా నీవుంటే కూనలమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేనా నీవుంటే కూనలమ్మ
No comments:
Post a Comment