Dec 2, 2007

శుభోదయం

తారాగణం:చంద్రమోహన్,సులక్షణ,మనోరమ
గాత్రం: బాలు,సుశీల
సంగీతం: మహదేవన్
నిర్మాత:సి హెచ్.నరసిం హరావు
దర్శకత్వం:కె.విశ్వనాథ్
సంస్థ:శ్రీరాం ఆర్ట్ పిక్చర్స్
విడుదల:1980

పల్లవి:

కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృఇష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా

చరణం1:

త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రాగమేమో తీసినట్టు ఉందమ్మ
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రాగమేమో తీసినట్టు ఉందమ్మ
ముసి ముసి నవ్వుల పువ్వులు పూసింది కొమ్మ
మువ్వ గొపాల మువ్వ గొపాలా
మువ్వ గొపాలా అన్నట్టుందమ్మ
అడుగుల్లొ సవ్వళ్ళు కావమ్మా
అవి ఎడదలో సందళ్ళు లేవమ్మా
అడుగుల్లొ సవ్వళ్ళు కావమ్మా
అవి ఎడదలో సందళ్ళు లేవమ్మా

కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృఇష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా

చరణం2:

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ
రాతిరేల సంత నిదుర రాదమ్మ
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ
రాతిరేల సంత నిదుర రాదమ్మ
ముసిరిన చీకటి ముంగిట వేచింది కొమ్మ
ముద్దుమురిపాల మువ్వగోపాలా
నీవు రావేలా అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మ
ముద్దుమురిపాల
ఆ కంచి వార్తలేమి చెప్పమ్మ
మువ్వగోపాలా
కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మా
నీవు రావేలా కృష్ణమ్మ

No comments: