Dec 2, 2007

అంతులేని కథ




పల్లవి:

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్దం ఏది పరమార్దం
ఏల ఈ స్వార్దం ఏది పరమార్దం

చరణం1:

నన్నడిగి తలితండ్రి కన్నారా ఆ ఆ ఆ ఆ అ
నన్నడిగి తలితండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పొవే పిచ్చమ్మ
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మ
ఏది నీది ఏది నాది ఈ బేధలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్దం ఎది పరమార్దం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

చరణం2:

శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముల్లకట్టుకు చుట్టు కంచె ఎందుకు పిచ్చమ్మ
కల్లు లేని కబోది చేతి దీపం నీవమ్మ
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఏ బతుకెంత దాని విలువెంత ఓ చెల్లెల
ఏల ఈ స్వార్దం ఎది పరమార్దం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

చరణం3:

తెలిసేట్లు చెప్పేది సిద్దాంతం అది తెలియెక పోతేనె వేదాంతం
మన్నులొనే మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మ
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పొవమ్మ
ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్దం ఎది పరమార్దం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

||

No comments: