Dec 2, 2007

సుందరకాండ (1992)


తారాగణం: వెంకటేష్,మీనా,అపర్ణ
గాత్రం: చిత్ర
సంగీతం: కీరవాణి
సాహిత్యం: వేటూరి సుందరరామముర్తి
నిర్మాత: సత్యనారాయణ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
సంస్థ:సౌదామిని పిక్చర్స్



పల్లవి:

ఆకాశాన సూర్యుడుండడు సందె వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలొనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా
కన్నీటి మీద నవసాగనేల
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

చరణం1:

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా
చిత్రములే బ్రతుకు నడకా
పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు
మళ్ళి తన మనిషై ఒడిలోకె చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

చరణం2:

ముళ్ళును పువ్వుగ భాదను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి
జన్మబందము ప్రేమగంధము పూటే చాలులే
పంజరమై బ్రతుకు మిగులు పావురమై బైటికెగురు
మైనా క్షణమైనా పలికిందే భాష
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా
కన్నీటి మీద నవసాగనేల
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

-------------------------------------



-------------------------------------

No comments: