Mar 17, 2008

పాతాళభైరవి

గాత్రం:ఘంటసాల

పల్లవి:

కనుగొనగలనో లేనో కనుగొన గలనోలేనో ప్రాణముతో సఖిని కనుగొనగలనో లేనో

చరణం1:

పెండ్లి పీటపై ప్రియనెడబాయ గాలి మేడలు గారడి కాగా
పెండ్లి పీటపై ప్రియనెడబాయ గాలి మేడలు గారడి కాగా
కల కాలమును కర్మను దూరుచు కలగ బ్రతకడమేనో
కనుగొనగలనో లేనో

చరణం2:

వెదకి వెదకి ఏ జాడ తెలియక హృదయమంతా చీకటిగా
వెదకి వెదకి ఏ జాడ తెలియక హృదయమంతా చీకటిగా
ఎంత పిలచినా పిలుపే అందక చింతించి తిరగటమేనో
కనుగొనగలనో లేనో

చరణం3:

పులివాతనుబడు బాలహరిణియై చెలి ఎచ్చటనో చెరబడగా
పులివాతనుబడు బాలహరిణియై చెలి ఎచ్చటనో చెరబడగా
జాలిలేని ఆ మాయదారికే బలిగా చేయగాడమేమో

కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖిని కనుగొన గలనో లేనో
కనుగొనగలనో లేనో

--------------------------------------------------

--------------------------------------------------

No comments: