Mar 18, 2008

రుద్రవీణ

గాత్రం:బాలు


పల్లవి:

చీకటమ్మ చీకటి ముచ్చటైన చీకటి
వెచ్చనైన ఊసులన్ని రెచ్చ గొట్టు చీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి
ముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటి
పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిదరోనీ
రాయే రాయే రామ చిలక సద్దుకుపోయే చీకటెనక ఆ ఆ

నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లలో
నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని

చరణం1:

వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్ని
నమ్మకు నమ్మకు అరే నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని

చరణం2:

ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారికి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
పక్కవారికి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
ఏహాయి రాదోయి నీవైపు నడువకు

నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు అహా నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని

చరణం3:

శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
ఆ నాడు ఆకంత గీతాలు పలుకును కాదా
గసమ గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని
సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ

నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు అహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లలో
నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని

||

No comments: