Mar 19, 2008
సితార
పల్లవి :
కుకుకు కుకుకు
కుకుకు కుకుకు కోకిల రావే
కుకుకు కుకుకు కోకిల రావే
రాణివాసము నీకు ఎందుకో కో కో కో
రెక్క విప్పుకో చుక్కలెందుకో కో కో కో
కుకుకు కుకుకు కోకిల రావే ఏ ఏ ఏ ఏ
చరణం1:
రంగులలోకం పిలిచే వేళ రాగం నీలో పలికే వేళ
విరుల తెరలే తెరచి రావే బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకి రావే ఈ పల్లవి పల్లకిలో
నా పాటల తోటకి రావే ఈ పల్లవి పల్లకిలో
స్వరమై రావే విరిపొదల ఎదలకు
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే ఏ ఏ ఏ ఏ
చరణం2:
సుర్యుడు నిన్నే చూడాలంట చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు గిరుజు విడిచి రావే
గడప తలుపు దాటి రావే
నువ్వేలే రాజ్యం వుంది ఆ నాలుగు దిక్కులలో
నువ్వేలే రాజ్యం వుంది ఆ నాలుగు దిక్కులలో
లయగా రావే ప్రియ హృదయజతులతో
కుకుకు కుకుకు కోకిల రావే
కుకుకు కుకుకు కోకిల రావే
రాణివాసము నీకు ఎందుకో కో కో కో
రెక్క విప్పుకో చుక్కలెందుకో కో కో కో
కుకుకు కుకుకు కోకిల రావే ఏ ఏ ఏ ఏ
-------------------------------------------------
పాట ఇక్కడ వినండి
-------------------------------------------------
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment