Mar 22, 2008

ఆత్మబలం




పల్లవి:

చిటపట చినుకులు పడుతూవుంటే
చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులుపట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
ఉరుములు పెళపెళ ఉరుముతు వుంటే
మెరుపులు తళతళ మెరుస్తు వుంటే
మెరుపు వెలుగులో చెలి కన్నులలో
బిత్తర చూపులు కనపడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి

చరణం1:

కారుమబ్బులు కమ్ముతువుంటే.. కమ్ముతువుంటే
ఓ కళ్ళకు ఎవరు కనపడకుంటే ..కనపడకుంటే
ఆ కారుమబ్బులు కమ్ముతువుంటే.. కమ్ముతువుంటే
ఓ కళ్ళకు ఎవరు కనపడకుంటే ..కనపడకుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి

చరణం2:

చలి చలిగా గిలి వేస్తుంటే అహాహాహ
గిలిగింతలు పెడుతూవుంటే ఒహొహొహొ
చలి చలిగా గిలి వేస్తుంటే అహాహాహ
గిలిగింతలు పెడుతూవుంటే ఒహొహొహొ
చెలి గుండియలో రగిలే వగలే
చెలి గుండియలో రగిలే వగలే
చలి మంటలుగా అనుకుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి

చిటపట చినుకులు పడుతూవుంటే
చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులుపట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి

||

No comments: