Mar 2, 2008

ఆత్మీయులు



పల్లవి:

చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను నాలోనే
వలపు పొంగేను నాలోనే
ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను
నిన్ను నే చేరుకున్నాను

చరణం1:

చూపుల శృంగారమొలికించినావు మాటల మధువెంతో చిలికించినావు
వాడని అందాల వీడని బంధాల తోడుగ నడిచేములే ఏ ఏ ఏ
చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను నాలోనే
ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను

చరణం2:

నేను నీదాననే నీవు నావాడవే నను వీడిపోలేవులే
కన్నుల ఉయ్యాల ఊగింతునోయి చూడని స్వర్గాల చూపింతునోయి
తీయని సరసాల తీరని సరదాల హాయిగ తేలేములే
ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను
నిన్ను నే చేరుకున్నాను




||

No comments: