శృంగారరాయని చెలువుమీరిన కొండ ఫణిరాజు పేరిటి పసిడి కొండ ఘోరపాపమనన్‌చు కొనేర్లు గల కొండ తలచిన మోక్షంబు తగులు కొండ చిలుకలు కోయిలలు చెలగి కూసెడి కొండ చెలగి కూసెడి కొండ వెగజాతి కోట్లెల్ల వెలగు కొండ పుష్పజాతుల విష్ణు పూజింపగల కొండ కల్పవృక్షములైదు కలుగు కొండ అమరవరులకునాధారమైన కొండ ఆళ్వారులకు ప్రత్యక్షమైన కొండ అలరజూచిన బ్రహ్మాండమైన కొండ నేను కనుగొంటి శ్రీవేంకటేశు కొండ శ్రీవేంకటేశు కొండ
ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ ఎదలో నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన ఎదలో నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మనీ
జగదభిరాముడు శ్రీరాముడే రఘుకులసోముడు ఆ రాముడే జగదభిరాముడు శ్రీరాముడే రఘుకులసోముడు ఆ రాముడే
ఉప పల్లవి:
జనకుని మాటల తలపై నిలిపి తన సుఖముల విడి వనితామణితో వనములకేగిన ధర్మావతారుడు జగదభి రాముడు శ్రీరాముడే
చరణం1:
కరమున ధనువు శరములు దాలిచి కరమున ధనువు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కరమున ధనువు శరములు దాలిచి ఇరువది చేతుల దొరనే కూలిచి సురలను గాచిన వీరాధివీరుడు జగదభి రాముడు శ్రీరాముడే
నిరతము ధర్మము నెరపి నిలిపి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నిరతము ధర్మము నెరపి నిలిపి నరులకు సురలకు తరతరాలకు వరవడియైన వరయుగ పురుషుడు జగదభి రాముడు శ్రీరాముడే
గామా గామ హంగామా మనమే హయి చిరునామ పాత బాధ గదిని ఖాళి చేద్దామా గామా గామ హంగామా కష్టం ఖర్చు పెడదామా మొత్తం సంతోషం జమ చేద్దామా గామా గామ హంగామా మనమే హయి చిరునామ పాత బాధ గదిని ఖాళి చేద్దామా గామా గామ హంగామా కష్టం ఖర్చు పెడదామా మొత్తం సంతోషం జమ చేద్దామా
చరణం1:
నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన కోరిక కలిగింది ఆ కోరికేమిటో చెప్పని నను వీడి నువ్వు వెళ్ళొద్దని మళ్ళీ రాయిని చెయ్యెద్దని
గామా గామ హంగామా మనమే హయి చిరునామ పాత బాధ గదిని ఖాళి చేద్దామా
చరణం2:
నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చింది నీ స్పూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న గెలుపే అందింది ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది ఆ మనసు అలిసి పోరాదని ఈ చెలిమి నిలిచి పోవాలని ఇలా బ్రతుకును గెలవాలని
గామా గామ హంగామా మనమే హయి చిరునామ పాత బాధ గదిని ఖాళి చేద్దామా గామా గామ హంగామా కష్టం ఖర్చు పెడదామా మొత్తం సంతోషం జమ చేద్దామా
తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ చెలిమిని నిలిచే అలమేల్మంగమ చెలువములే ప్రియసేవలయ తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ
ఆశారాగమే ఆలాపనగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆశారాగమే ఆలాపనగా సరసరీతుల స్వరమేలనా ఆశారాగమే ఆలాపనగా సరసరీతుల స్వరమేలనా అభినయనటనలే ఆరాధనగా అభినయనటనలే ఆరాధనగా ప్రభునలరించి తరింతుమయ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ చెలిమిని నిలిచే అలమేల్మంగమ చెలువములే ప్రియసేవలయ తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ నీ కన్నుల కాటుక లేఖలలో నీ సొగసుల కవితా రేఖలలో ఇలా ఇలా చదవనీ నీ లేఖని ప్రణయ లేఖని బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
చరణం1:
అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం వెదుకుతు ఉంది వేదన తానై విదియ నాటి జాబిలి కోసం వెలుగునీడలెన్నున్నా వెలగలేని ఆకాశం లల ఆ ఆ లల ఆ ఆ ఆ ఆ ఆ ఆ తనన తనన తనన తనన ఎదుగుతు ఉంది వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
చరణం2:
అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయనీ నీ లేఖని ప్రణయ లేఖని లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
చెదిరిన నీ కుంకుమలే తిరిగిరానివా నిత్యసౌభాగ్యాలే చెరిగిపోయెనా పసిదానివే అని చూడక వసివాడని నీ బ్రతుకున విధియే విషమే చిలికే చెదిరిన నీ కుంకుమలే తిరిగిరానివా నిత్యసౌభాగ్యాలే చెరిగిపోయెనా
చరణం1:
ఆరిపోనిదమ్మ నీ కన్నీటి శోకం భారతాన స్త్రీ జాతికి భర్తయే సర్వం నూరేళ్ళు ఉండేదంటారే మాంగళ్యం ముడినే తెంచేవేసారే ఏం ఘోరం స్వర్గతుల్యమైనదే నీ సంసారం శోకసంద్రమైనదే నీ ప్రాయం బ్రతుకే మోడై మిగిలే ఏ ఏ ఏ
చెదిరిన నీ కుంకుమలే తిరిగిరానివా నిత్యసౌభాగ్యాలే చెరిగిపోయెనా
చరణం2:
మానిపోనిదమ్మ నీ ఎదలోని గాయం రాలిపోయెనమ్మ నీ సిగలోని కుసుమం పడతికి బొట్టు కాటుకలే ఆధారం మెడకొక ఉచ్చును పోలినదే వైధవ్యం గాజులతొ కన్న కలల మోజులే పోయే గాజుకళ్ళ జీవితమె తెల్లబోయే తోడే నీకే కరువై
చెదిరిన నీ కుంకుమలే తిరిగిరానివా నిత్యసౌభాగ్యాలే చెరిగిపోయెనా పసిదానివే అని చూడక వసివాడని నీ బ్రతుకున విధియే విషమే చిలికే చెదిరిన నీ కుంకుమలే తిరిగిరానివా నిత్యసౌభాగ్యాలే చెరిగిపోయెనా
తారాగణం: రోహిత్,సంతోష్ పవన్,రుతిక గాత్రం: కుమార్ సాను సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ సంగీతం: ఘంటాడి కృష్ణ దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి విడుదల: 2001
పల్లవి:
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే హా నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే ఓ ఓ ఓ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే హా నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే హొ కాశ్మీరులొ కనపడుతుందా నీ నడకల్లోని అందం తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం నా ఊపిరి చిరునామా నువ్వే హా దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే
చరణం1:
మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే నా మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే నిను మేఘాల ఒక బొమ్మ గావించగా నే మలిచాను హరివిల్లునే కుంచెగా ఈ చిరుగాలితో చెప్పనా నీ మదినిండ నేనుండగా
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే ఓ ఓ ఓ నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే
చరణం2:
ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా కొంగుముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నా ఆ ఆ ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా కొంగుముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నా నా కలలన్ని నీ కనులు చూడాలని బతిమాలాను నీ కంటిలో పాపని మన్నించేసి నా మనసుని ప్రసాదించు నీ ప్రేమని
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే ఓ ఓ ఓ నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే హొ కాశ్మీరులొ కనపడుతుందా నీ నడకల్లోని అందం తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం నా ఊపిరి చిరునామా నువ్వే ఓ ఓ ఓ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే
ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ ఈ చిటపట చింత నీ దయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యో రామా ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ
చరణం1:
ఏపుగ ఊగే ఒంపుల పైరు కోతకు సయ్యందే హహహా ఊపుగ రేగే చూపుల ఏరు కోతను కోసిందే కొంగెట్టి కూసే రంగుల ఊసే ఒంగొంగి చూసే లొంగని ఆశే వెర్రెక్కే కన్ను వేటాడెనే నిన్ను ఏమూల దాచేది సింగారం
ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ ఈ చిటపట చింత నీ దయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యో రామా ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ
చరణం2:
ఏటికిసైతం ఏతం వేసే వేగం బాగుందే పైటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే హొయ్ ఏకల్లే చేరి మేకైనావు సోకుల్లో ఊరి చెలరేగావు తాంబూలం తెచ్చా తడిపొడి పంచా ఎన్నాళ్ళు మోస్తావు వయ్యారం
ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ ఈ చిటపట చింత నీ దయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యో రామా ఓం నమోనమ: యవ్వనమా రావమ్మ ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమ
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
చరణం1:
వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా కంటికెదురుపడతావేంటి ఎటు చూసినా చెంప గిల్లి పోతావేంటి గాలి వేలితోన అంత గొడవ పెడతావేంటి నిద్దరోతు ఉన్నా అసలు నీకు ఆ చొరవే ఎంటి తెలియకడుగుతునా ఒంటిగా ఉండనీయవేంటి ఒక్క నిమిషమైన ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను నువ్వేం చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
చరణం2:
నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచ్చటైనా ఏడిపించ బుద్దవుతుంది ఎట్టాగైన ముద్దుగానె ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా నిన్ను రెచగొడుతూ నేనే ఓడిపోతు ఉన్నా లేని పోని ఉక్రోషంతో ఉడుకెత్తనా ఇదేం చూడక మహ బోరుగా ఏటో నువ్వు చూస్తూ ఉన్నా అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చస్తున్నా అయ్యో రామా
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ ఐ లవ్ యూ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ
అందచందాల ఓ జాబిలి చెరరావా ప్రియా నా దరి నా మది దోచిన రాజువై అందచందాల ఓ తారక చెరరావే చెలి నా దరి నా మది దోచిన రాణివే
చరణం2:
అహహా ఒహొహొ అహహా ఒహొహొ ఓ ప్రేయసి నా ప్రేయసి సిసలైన గోల్డు మన ప్రేమ నా కోహినూర్ డైమండువే నా తలపైన కూర్చోవె తన్నన్న నాన తన్నన్న నాన అహహా ఒహొహొ అహహా ఒహొహొ ఓ ప్రేయసి నా ప్రేయసి సిసలైన గోల్డు మన ప్రేమ నా కోహినూర్ డైమండువే నా తలపైన కూర్చోవె
తన్నన్న నాన తన్నన్న నాన సందేహమా ఓ దేహమా మరి ప్రేమంటె లోహమా నీ అందము నా చందము మెచ్చేనోయి ఓ వామన తన్నన్న నాన తన్నన్న నాన తన్నన్న నాన తన్నన్న నాన సందేహమా ఓ దేహమా మరి ప్రేమంటె లోహమా నీ అందము నా చందము మెచ్చేనోయి ఓ వామన ఒహొహొ హొహొ హహహ హహ ప్రేమించవా పాలించవా దయ రాదా నా మీద సంసారమో సన్యాసమో ఇక తేల్చాలె ప్రియురాల హహహహ హాహ ఒహొహొహొ హొహొ
స్వామి నీ మోహంతో నీ సేవా దాహంతో ప్రతిక్షణం నీకోసం ప్రతీక్షించితి హరి అలసితి హరి సొలసితి
చరణం2:
నీ ఊహల ఊపిరుల గాలి పీల్చితి నీ అడుగుల అడుగేసి ఏడడుగులు నడచితి అహర్నిశలు నీకోసం పరితపించితి ఇకపై ఒక నిమిషమైన నిను వీడలోనైతి నన్నేలుము నా పతి హరి హరి అలసితి
మధురమే మధురమే మధురమే ఈ కనులకి కలలు మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై నాకోసం వస్తే మధురమే ఆ ఆ ఆ నన్నే తడిపేస్తే మధురమే
మధురమే మధురమే మధురమే ఈ కనులకి కలలు మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై నాకోసం వస్తే మధురమే ఆ ఆ ఆ నన్నే తడిపేస్తే మధురమే
చరణం1:
నీకోసం నే రాసే చిరు పాటైనా మధురమే నాకోసం నువ్వు పలికే అరమాటైనా మధురమే నీకోసం నే రాసే చిరు పాటైనా మధురమే నాకోసం నువ్వు పలికే అరమాటైనా మధురమే లిపిలేని సడిలేని ఆ కన్నుల భాష మధురమే హృదయాన్ని మురిపించే ఆ సాగర ఘోష మధురమే మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే ఉంటే నువ్వుంటే ఆ శూన్యం అయినా మధురమే మధురమే
మధురమే మధురమే మధురమే ఈ కనులకి కలలు మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై నాకోసం వస్తే మధురమే ఆ ఆ ఆ నన్నే తడిపేస్తే మధురమే
చరణం2:
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే ఉదయాన్న ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే చెక్కిలి మెరుపు మధురమే చెలి కాటుక నలుపు మధురమే రాల్చే కను రాల్చే ఆ కన్నీరైన మధురమే మధురమే
మధురమే మధురమే మధురమే ఈ కనులకి కలలు మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెల వానై నాకోసం వస్తే మధురమే ఆ ఆ ఆ నన్నే తడిపేస్తే మధురమే
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
చరణం1:
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృత మిచ్చింది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది
చరణం2:
చెమటనీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించే దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
తారాగణం : రామారావు,బి.సరోజాదేవి,నాగయ్య,బేబి పద్మిని గాత్రం: సుశీల సంగీతం : ఘంటసాల దర్శకత్వం : కమలాకర కామేశ్వరరావు నిర్మాతలు: శ్రీధరరావు,లక్ష్మీరాజ్యం నిర్మాణ సంస్థ : రాజ్యం పిక్చర్స్ విడుదల: 1966
పల్లవి:
నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా నీవే సుకుమార రారా ఓ వీర నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా నీవే సుకుమార రారా ఓ వీర
చరణం1:
నెలరాజులోని సొగసు దినరాజులోని వెలుగు నెలరాజులోని సొగసు దినరాజులోని వెలుగు నీయందు నిండి నా కలలు పండి యువరాజువవుదులేరా రారా సుకుమార ఒహో వీర
చరణం2:
హరిచేత సిరులు పొంది హరుచేత వరములొంది హరిచేత సిరులు పొంది హరుచేత వరములొంది లోకాలనేలి భోగాల తేలి చిరకీర్తినందుకోర రారా సుకుమార ఒహో వీర
చరణం3:
ఇంటింట శాంతి నిలిపి జగమంత కాంతి నింపి ఇంటింట శాంతి నిలిపి జగమంత కాంతి నింపి సురవరుల నరుల జేజేలనంది వర్ధిల్లు భరతవీర రారా సుకుమార ఒహో వీర
నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా నీవే సుకుమార రారా ఓ వీర రారా ఓ వీర
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడొ చేయి జారి పోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన వుంటునే ఏం మాయ చేసావొ ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను
చరణం1:
నడి రేయిలో నీవు నిదరైన రానీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకోనీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము ఏ వైపు చూస్తున్నా నీ రూపే తొచింది నువు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏం తొచనీకుంది నీ మీద ఆశేదో నను నిలువనీకుంది మతి పొయి నేనుంటే నువు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను
మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా వేధించెలే నన్నే నీ నీడలా మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా
చరణం1:
వెచ్చనైన గుండె గిన్నెలో వెన్ననింక దాచి వుంచుకో పొన్నచెట్టు లేని తోటలో కన్నె వేణువాలపించకు ప్రేమ అన్నదే ఓ ఓ ఓ పల్లవైనది పెదవి తాకితే ఓ ఓ ఓ పాటలే అది ఆమని ప్రేమని పాడే కోయిల
మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా వేధించెలే నన్నే నీ నీడలా
చరణం2:
మౌనమైన మాధవీలత తాను కొమ్మనల్లుకున్నది వేల్లువైన రాగమిప్పుడే ఏకతాళమందుకున్నది తోచదాయెనే ఓ ఓ ఓ తోడులేనిదే కౌగిలింతలే ఓ ఓ ఓ కావ్యమాయెలే ఎన్నడూ లేనిది ఎందుకో ఇలా
మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా వేధించెలే నన్నే నీ నీడలా మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా
ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా అంత వింత గాధల్లో ఆనందలాల..ఊహు ఆ ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా అంత వింత గాధల్లో అమ్మలాల పైడికొమ్మలాల ఏడి ఏమైయాడో జాడలేడియ్యల ఓసి తందనాలా ఆనందలాల గొగుల్లాల పిల్ల గోగుల్లాల గొళ్ళ భామల్లాల ఏడనుందియ్యాల నాటి నందనాల ఆనందలీల ఆ ఆ ఆ ఆ ఆ ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా అంత వింత గాధల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లించవల్లా రేపల్లె వాడల్లో ఆనందలీల అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికి అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికి బాలుడా గోపాలుడా లోకాలపాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా అంత వింత గాధల్లో ఆనందలాలా
తారాగణం: బాలకృష్ణ, విజయశాంతి, సీత గాత్రం: బాలు,సుశీల,శైలజ సంగీతం: కె.వి.మహదేవన్ దర్శకత్వం : కోడి రామకృష్ణ నిర్మాత: యస్.గోపాలరెడ్డి సంస్థ: భార్గవ్ ఆర్ట్ పిక్చర్స్ విడుదల: 1989
పల్లవి:
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా పాడనా చంటిపాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
చరణం1:
అరచేత పెంచాను చెల్లిని ఈ అరుదైన బంగారు తల్లిని అడుగేస్తే పాదాలు కందవా నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా అమ్మగా లాలించాడు నిన్ను నాన్నగా పాలించాడు అన్నగా ప్రేమించాడు అన్ని తానైనాడు తన ప్రాణంగా నను పెంచాడు ఆ దైవంగా దీవించాడు నా అన్నలాంటి అన్న ఈ లోకాన లేడు
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
చరణం2:
ఆరేడు మాసాలు నిండగా ఈ అన్నయ్య కలలన్ని పండగా తేవాలి బంగారు ఊయల కావాలి మా ఇల్లు కోవెల రెప్పగా నిను కాచనా పాపగా నిను చూడనా రేపటి ఆశ తీరగా ఈ పాపకు జోల పాడనా ఇది అరుదైన ఓ అన్న కథ ఇది మురిపాల ఓ చెల్లి కథ ఇది చెల్లెలే కాదులే నను కన్నతల్లి
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా పాడనా చంటిపాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
తారాగణం: రాజశేఖర్,సుహాసిని గాత్రం: బాలు,జానకి సంగీతం: కె.వి.మహదేవన్ దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య సంస్థ: కృష్ణ చిత్ర విడుదల: 1989
పల్లవి:
మల్లెలతో ఆడుకొనే మనసుండాలి అమ్మాయి వెన్నెలతో కిన్నెరలా పాడుకో హాయిగా ప్రతిరేయి మల్లెలతో ఆడుకొనే మనసుంటే సరిపోదోయి ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి
చరణం1:
నీ కళ్ళలోనే కౌగిళ్ళలోనే నే నీతో ఉండాలని హా ఆ గుండెలోనె నీరెండలోనే నీడల్లే ఆడాలని ఓ మావిళ్ళ పూతే వేవిళ్ళ వలపై దాగుళ్ళు ఆడే లోగిళ్ళలోన గుడిగుడిగుంచం గుండెరాగం పాడాలని
మల్లెలతో ఆడుకొనే మనసుండాలి అమ్మాయి ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి
చరణం2:
కేరింతలాడే గోరంతదీపం నా ఇంట వెలగాలని కవ్వింతలాడే అందాల రూపం నట్టింట తిరగాలని హొ చిన్నారులాడే చిరునవ్వులన్ని అందాలు విరిసే హరివిల్లే అయితే ఆ హరివిల్లే మన పొదరిల్లై ఉండాలని
మల్లెలతో ఆడుకొనే మనసుంటే సరిపోదోయి ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి మల్లెలతో ఆడుకొనే మనసుండాలి అమ్మాయి వెన్నెలతో కిన్నెరలా పాడుకో హాయిగా ప్రతిరేయి
తారాగణం:అక్కినేని నాగేశ్వరరావు,సావిత్రి ,కృష్ణకుమారి గాత్రం:జిక్కి,ఘంటసాల సంగీతం: ఘంటసాల దర్శకత్వం: సి.యస్.రావు నిర్మాత:సుందర్‌లాల్ నహతా సంస్థ: శ్రీ ప్రొడక్షన్స్ విడుదల:1960
పల్లవి:
ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహొ బస్తీ దొరసాని
చరణం1:
ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్ ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్ ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది
ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహొ బస్తీ దొరసాని
చరణం2:
కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది హాయ్ కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది హాయ్ ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నెలాడి కోపం పోయింది
ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహొ బస్తీ దొరసాని
చరణం3:
పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది హాయ్ పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది హాయ్ చివరకు చిలిపిగ నవ్వింది, చేయి చేయి కలిపింది అందచందాల వన్నెలాడి ఆడి పాడింది
ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహొ బస్తీ దొరసాని ఓహొ బస్తీ దొరసాని ఓహొ బస్తీ దొరసాని
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథా వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా
చరణం1:
శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భూజాని పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని కారుచిచ్చుగా మారెను కైక మంథర మాట విని,మంథర మాట విని వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా
చరణం2:
అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృథివి మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని,కూలే భువి పైని వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా
తారాగణం: కృష్ణ, రాధిక, సుహాసిని గాయకులు: జేసుదాసు, సుశీల సంగీతం: చక్రవర్తి దర్శకత్వం: జి.రామ్మోహనరావు నిర్మాత: అంగర సత్యం నిర్మాణ సంస్థ: రాజ్యలక్ష్మి మూవీస్
పల్లవి:
తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ ఒడిలోని నా చెలి సొగసారబోసే వేళ గిలిగింత గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మించిపోయే వేళ పులకింత రాగాలెన్నో పురులు విరిసినవి కౌగిళ్ళలో తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ
చరణం1:
సోగకనులే మూగ కలలై లేత గుసగుసలాడెయ్యగా మేను వణికి తేనె పెదవి తీపి వలపులు తోడెయ్యగా వయసుతో పరిచయం జరిగిన తొలకరి పరిమళం చూపుతున్నవేళ నీలో ఎన్ని అందాలో గాడమైన కౌగిలింత ఎన్ని బంధాలో అలుపు ఎరుగనిది ఈ లాహిరి
తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ ఒడిలోని నా చెలి సొగసారబోసే వేళ
చరణం2:
వాలుజడలో పూల గొడవ వెన్ను తడిమి వేధించగా పాల మెడలో లేత ఎడద ప్రేమ జతులే పండించగా జరగని ప్రతిదినం జరగక తప్పని లాంచనం రేగుతున్న ఈడు గిల్లి జోలపాడాలో ముందుగానె జోలలింక నేర్చుకోవాలో చాలు సరసమిక సందిళ్ళలో
తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మించిపోయే వేళ గిలిగింత గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ ఒడిలోని నా చెలి సొగసారబోసే వేళ
రంగా శ్రీరంగా నా మొర వినరా నీ దరిజేరుచుకోరా దరిజేరుచుకోరా రంగా నా మొర వినరా శ్రీరంగా దరిజేరుచుకోరా రంగా
చరణం1:
ఎరుగను వేదపురాణ రహస్యము ఎరుగను నీ పద బాగుణ సేవ తిరిగితిరిగి పెడదారులలో తిరిగితిరిగి పెడదారులలో నిజమెరిగి నిన్ను శరణంటినిరా దరిజేరుచుకోరా రంగా నా మొర వినరా శ్రీరంగా దరిజేరుచుకోరా రంగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయి నీదే కదా చెలి నా రాణి నీవే కదా నా రాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయి నాదే కదా ఇక నీ రాణి నేనే కదా
చరణం1:
నిన్ను చూచి నీ వన్నె చూచి నను నేనె మరచేనులే నను నేనె మరచేనులే ఈనాటికైనా ఏనాటికైనా ఈనాటికైనా ఏనాటికైనా నేనె నీలో నిలిచేనులే
నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయి నీదే కదా చెలి నా రాణి నీవే కదా
చరణం2:
ఇన్నినాళ్ళు ఈ నీలి కళ్ళు ఏ కోనలో దాగెనో ఏ కోనలో దాగెనో నే కోరుకున్న నా స్వామికోసం నే కోరుకున్న నా స్వామికోసం ఈ కళ్ళు ఇన్నాళ్ళు వేచేనులే
నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయి నీదే కదా చెలి నా రాణి నీవే కదా ఆ ఆ ఆ ఆ ఆ నా రాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయి నాదే కదా ఇక నీ రాణి నేనే కదా